బీజేపీపై అతిశీ కీలక వ్యాఖ్యలు..! 6 h ago
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నది. గురువారం అతిషీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బీజేపీ మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ చేసిన "అతిషీ తనతండ్రిని మార్చేశారు" అనే వ్యాఖ్యపై స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రజలు బూతులు మాట్లాడే పార్టీకి ఓటు వేయబోరని అన్నారు.